టీమిండియా భవిష్యత్తు వీరిమీదే ఆధారపడి ఉందా?

praveen
అవును, ఆలోచిస్తే అది నిజమేనని అనిపించక మానదు. టి20 వరల్డ్ కప్ తరువాత బడా ప్లేయర్లు క్రికెట్ కెరీర్ కి స్వస్తి చెప్పారు. ఇపుడు ఆశలన్నీ నవతరం పైనే. సరిగా ఇలాంటి తరుణంలో నక్షత్రాల్లా మెరిశారు అభిషేక్ శర్మ మరియు జైస్వాల్. ఐపీఎల్ లో సూపర్ ఇన్నింగ్స్ లు ఆడి భార‌త టీ20 జ‌ట్టులో చోటుద‌క్కించుకున్న యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్ లో త‌న తొలి సెంచ‌రీని సాధించి వారేవా అనిపించుకున్నాడు. తన తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో డ‌కౌడ్ అయిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపిస్తూ దనా దన్ ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వేతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 100 ప‌రుగులు తేడాతో విజ‌యం సాధించింది అంటే అందు ప్రధాన పాత్ర అభిషేక్ దే నని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏముంది?
టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సునామీ ఇన్నింగ్స్ తో మొదలైంది. 100 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 8 సిక్స‌ర్లు, 7 ఫోర్లు బాది ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించాడు. ఈ క్ర‌మంలోనే రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచ‌రీని సాధించిన అభిషేక్ శ‌ర్మ.. భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే... ఈ మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ సిక్స‌ర్ తో త‌న ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసాడు. ఆ తరువాత సిక్స‌ర్ తోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసాడు. ఆ త‌ర్వాత సెంచ‌రీ కూడా సిక్స‌ర్ తోనే అందుకుని అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.
ఇకపోతే 21 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆమధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు కురిపించిన సంగతి విదితమే. 60 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులు చేసి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో 2 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. ఇంకో విషయం ఏమిటంటే... 23 ఏళ్ల వయస్సు లోపు 2 సెంచరీలు చేసిన ఆటగాడు ఇప్పటివరకు ఎవరూ లేకపోవడం. ప్రస్తుతం యశస్వి వయస్సు 22 ఏళ్ల 116 రోజులు. ఇక ఈ ఇద్దరి ఆటగాళ్లను చూసిన క్రికెట్ అభిమానులు టీమిండియా భవిష్యత్తు వీరిమీదే ఆధారపడి అంటూ ఆశలు పెట్టుకుంటున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: