టీ 20 వరల్డ్ కప్ : ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీ ఇదే.. ఇండియాకు ఎంత వస్తుందో తెలుసా..?

Pulgam Srinivas
ఎంతో రసవత్తరంగా కొంత కాలం నుండి నడుస్తున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ నిన్నటితో ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ ... సౌత్ ఆఫ్రికా జట్లు తలబడ్డాయి. ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 177 పరుగులు చేసింది. దానితో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మొదటి 15 ఓవర్ల వరకు అద్భుతమైన ఆట తీరును కనపరిచిన ఆ తర్వాత ఐదోవర్లలో మాత్రం భారత జట్టు తన అద్భుతమైన బౌలింగ్ తో ఫీల్డింగ్ తో విజయం సాధించింది. ఇకపోతే ఐసీసీ క్రికెట్ మెయిన్స్ వరల్డ్ కప్ లో భాగంగా గెలిచిన జట్టుకు ఎంత మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుంది. ఫైనల్ వరకు వచ్చి ఓడిన జట్లకు ఎంత వస్తుంది. ఇతర జట్లకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది ఇలాంటి వివరాలన్నింటిని తెలుసుకుందాం.
టి20 మెన్స్ వరల్డ్ కప్ 2024 ప్రైజ్ మనీ మొత్తంగా 93.50 కోట్లు.
ఇక ఈ టోర్నీలో విజయం సాధించిన జట్టుకు 20.42 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. అందులో భాగంగా ఈ సీజన్లో ఇండియా జట్టు గెలిచింది కాబట్టి భారత జట్టుకు ఐసిసి నుండి 20.42 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది.
టోర్నీలో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయిన జట్టుకు 10.67 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. దానితో నిన్న జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు అయినటువంటి సౌత్ ఆఫ్రికాకు 10.67 కోట్ల నగదు బహుమతి ఐసీసీ నుండి అందుతుంది.
సెమీస్ వరకు వచ్చి ఓడిన జట్లకు 6.56 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. అందులో భాగంగా ఈ సీజన్ లో ఆఫ్ఘనిస్తాన్ , ఇంగ్లాండ్ సెమీస్ వరకు వచ్చి ఓడిపోయాయి. దానితో ఈ రెండు జట్లకి చెరో 6.56 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది.
సూపర్ 8 లో ఓడిన యూఎస్ఏ , వెస్టిండీస్ , ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్ జట్లకు 3.17 కోట్ల చొప్పున దక్కుతాయి.
9 నుండి 12వ ర్యాంకు ఉన్న టీమ్లకు 2.5 కోట్లు , 13 నుండి 20 వ ర్యాంక్ ఉన్న జట్లకు 1.87 కోట్లు , గెలిచిన ఒక్కో మ్యాచ్ కి 26 లక్షల నగదు బహుమతి దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: