హార్దిక్ కాదు.. రోహిత్ కి అసలైన వారసుడు అతనే : మంజ్రేకర్

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్సీ అందుకున్న తర్వాత ఇక టీమ్ ఇండియా సక్సెస్ రేట్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కూడా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ అవుతున్నాడు రోహిత్ శర్మ. అయితే ఇక ఇప్పుడు రోహిత్ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నాడు. మరి రానున్న రోజుల్లో అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని వారసుడిగా ఇక భారత క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోబోయేది ఎవరు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే హార్దిక్ పాండ్యానే టీమ్ ఇండియాకు రోహిత్ తర్వాత కెప్టెన్ అంటూ గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గతంలో ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా  సక్సెస్ కావడంతో బిసిసిఐ సెలెక్టర్లు అతనికి జట్టులో పెద్దపీటవేశారు. ఏకంగా రోహిత్ కి డిప్యూటీగా నియమించారు. ఇక రోహిత్ రెస్ట్ తీసుకున్నప్పుడల్లా.. టి20 లకు అతన్ని సారధిగా కొనసాగించారు. ఇక పరిస్థితులను బట్టి చూస్తే అతనే టీమ్ ఇండియాకు నెక్స్ట్ కెప్టెన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 రోహిత్ తర్వాత టీమ్ ఇండియాకు నెక్స్ట్ కెప్టెన్  హార్దిక్ పాండ్యానే అందరూ అనుకుంటున్న వేళ.. సంజయ్ మంజ్రేకర్ మాత్రం మరో పేరును తెరమీదకి తీసుకొచ్చాడు. సారథ్యంలో రోహిత్ కు సరైన వారసుడు ఎవరు అంటే స్టార్ ఫేసర్ బుమ్రా పేరు చెబుతా. మూడు ఫార్మాట్లలోను జట్టును సమర్థవంతంగా ముందుండి నడిపించే సత్తా అతనికి ఉంది. అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎంత ఒత్తిడి లోను సమయమనం కోల్పోకుండా కూల్ గా ఉండగలడు. టీ20 లో వన్డేలు టెస్టులకు డిఫరెంట్ కెప్టెన్స్ కావాలంటే అలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. కానీ రోహిత్ మాదిరిగా అన్ని ఫార్మాట్లకు ఒకే వ్యక్తి సారధిగా ఉండాలంటే బుమ్రాకే సారధ్య బాధ్యతలు అప్పగించడం ఎంతో బెటర్ అంటూ మంజ్రేకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: