ఆలౌట్ లలో.. T20 WC షాకింగ్ రికార్డ్?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరుగుతున్న 2024 t20 వరల్డ్ కప్ టోర్నీని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రపంచకప్ టోర్నీలోని ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. సాదరణంగా టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరుగా చెబుతూ ఉంటారు. కానీ ఈ వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఇలాంటి ఆట తీరును కనపరచలేదు. స్లో పిచ్ లపై బ్యాటింగ్ చేయడానికి తెగ తడబడి పోతున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ లోను లో స్కోరింగ్ నమోదు అవుతూ ఉండడం గమనార్హం.

 ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు చూసుకుంటే ఒక మ్యాచ్ లో 120 పరుగులు నమోదు అవుతూనే అదే గొప్ప అనే విధంగా మారిపోయింది పరిస్థితి. దీంతో ఇక ప్రతి మ్యాచ్ కూడా చివరి బంతి వరకు విజయం ఎవరి వైపు నిలుస్తుంది అన్న విషయం అర్థం కాక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి.  అయితే ఇలా లో స్కోరింగ్ గేమ్ లో నడుస్తున్నప్పటికీ అటు ఎన్నో మ్యాచ్లు అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తున్నాయి. అయితే ఇటీవల కేవలం ఆటగాళ్లు మ్యాచ్లు మాత్రమే కాదు ఏకంగా వరల్డ్ కప్ టోర్నినే ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఇదివరకు ఏ వరల్డ్ కప్ లో జరగని ఒక ఘటన ఇక ఈ వరల్డ్ కప్ లో చోటుచేసుకుంది.

 టి20 వరల్డ్ కప్ చరిత్రలో 100 కంటే తక్కువ స్కోర్లకు అత్యధిక సార్లు ఆల్ అవుట్ లు నమోదైన టోర్నమెంట్ గా టి20 వరల్డ్ కప్ 2024 నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్ లలో 100 కంటే తక్కువ పరుగులకే కొన్ని జట్లు ఆల్ అవుట్ అయ్యాయి. 2014లో 2021 లో 8 సార్లు ఇలా 100 కంటే తక్కువ పరుగులకు జట్లు ఆల్ అవుట్ కాగా.. 2010లో నాలుగు సార్లు ఇలా జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఇప్పటివరకు ఏకంగా పదిసార్లు ఇలా జట్లు 100పరుగుల లోపే ఆల్ అవుట్ కావడం గమనార్హం. అమెరికాలో ఉన్న స్లో పిచ్ లపై ఏ క్రికెటర్ కూడా సరిగ్గా ఆడలేక పోతున్నాడు. దీంతో ఇలా లో స్కోరింగ్ గేమ్లు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: