నాకు ఇదే చివరి వరల్డ్ కప్.. షాకీచ్చిన స్టార్ ప్లేయర్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ పేర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఇక ఏ వయసులో రిటైర్మెంట్ ప్రకటిస్తారు అంటే దాదాపు 40 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం కెరియర్ సాఫీగా సాగుతున్నప్పటికీ ఇక సడన్గా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపి అభిమానులు అందరికీ కూడా షాక్ ఇస్తూ ఉంటారు.

 కెరియర్ ఇంత హ్యాపీగా సాగిపోతున్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏమి వచ్చింది అని అభిమానులు అనుకునే విధంగా ఇక ఆయా స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ ప్రకటన ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇలాగే అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు మరో క్రికెటర్ న్యూజిలాండ్. జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ తనకు చివరిది అంటూ చెప్పుకొచ్చాడు ట్రెంట్ బౌల్డ్. అయితే తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా.. లేదా ఇతర ఫార్మాట్ లలో కొనసాగుతారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

 కాగా ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో కూడా ట్రెండ్ బౌల్ట్ అదరగొట్టేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ జట్టు ప్రస్థానం ఎలా ఉన్నప్పటికీ ట్రెంట్ బౌల్ట్ మాత్రం జట్టు విజయం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్లు ఆడగా.. అతను ఆ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి  అద్భుతమైన బౌలింగ్ తో ఏడు వికెట్లు తీశాడు. కానీ అటు న్యూజిలాండ్ టీం మాత్రం చెత్త ప్రదర్శన చేసి లీగ్ దశతోనే ఇక టి20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది అని చెప్పాలి. ప్రస్తుతం బౌల్ట్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: