అనుకున్నదే జరిగింది.. పాపం పాక్ టీమ్?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండగా.. ఇక ఎన్నో జట్ల విషయంలో ప్రేక్షకులు అంచనాలు మొత్తం తారుమారవుతున్నాయ్. ఎందుకంటే అద్భుతంగా రాణిస్తాయి అనుకున్న టీమ్స్.. చెత్త ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ ఉంటే.. ఇక ఎలాంటి అంచనాల లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం అదరగొడుతూ ఉన్నాయి. కాగా పాకిస్తాన్ జట్టు విషయంలో మాత్రం అందరూ అనుకున్నదే జరిగింది. ఇక ఎప్పుడూ ఆ జట్టు అంచనాలను తారుమారు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా ఇదే చేసింది.

 ఏకంగా వరల్డ్ కప్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే చిన్న టీం అయినా యూఎస్ఏ చేతిలో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న మాజీ ఛాంపియన్ టీం పాకిస్తాన్ ఇక తర్వాత చిరకాల ప్రత్యర్థి  అయినా టీమిండియాతో ఆడిన మ్యాచ్లో కూడా ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సూపర్ 8 కి అర్హత సాధిస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. అయితే ఆ జట్టు గెలుపు ఓటముల పైన మాత్రమే కాదు మిగతా టీమ్స్ గెలుపు ఓటములపై కూడా పాకిస్తాన్ భవితవ్యం ఆధారపడింది. చివరికి ఇక అందరూ అనుకున్నట్లుగానే కనీసం సూపర్ 8 కి కూడా చేరుకోకుండా పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించింది.

 ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా యుఎస్ఏ, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది అని చెప్పాలి. అయితే గ్రూప్ ఎ లో మొత్తం ఐదు పాయింట్లతో అమెరికా చివరికి సూపర్ 8 కు చేరుకుంది.  పాకిస్తాన్ మాత్రం చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే గ్రూప్ దశ దాటిన టీం గా యూఎస్ రికార్డ్ సృష్టించింది.  యూఎస్ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రదర్శన పై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: