అన్ని నిజాలు బయటపెడతా.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
భారత చిరకాల ప్రత్యర్థిగా కొనసాగే పాకిస్తాన్ జట్టు ఒకప్పుడు వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ టీమ్స్ లో ఒకటిగా కొనసాగేది. కానీ గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టు అంచనాలకు తగ్గట్లుగా రాణించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే చిన్న టీమ్స్ కంటే దారుణమైన ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది. దీనికంతటికి కారణం గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో నెలకొన్న గందరగోల పరిస్థితులు ఏకంగా క్రికెట్ బోర్డు అధ్యక్షుడి దగ్గర నుంచి ఏకంగా కోచింగ్ సిబ్బంది వరకు కూడా ఎప్పుడు ఎలాంటి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి కూడా అర్థం కాని పరిస్థితి అటు పాకిస్తాన్ క్రికెట్లో నెలకొంది.

 ఇంకోవైపు మొన్నటికి మొన్న బాబర్  ను కెప్టెన్సీ నుంచి తప్పించి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మళ్ళీ ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని బాబర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది  ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ జట్టు ఇక్కడ వరల్డ్ కప్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. దీంతో ఆ జట్టు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టును ఎవరు నాశనం చేశారో తెలుసు.. టి20 వరల్డ్ కప్ తర్వాత అన్ని బయటపెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన పై విమర్శలు వస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారిపోయాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ యువ ఫేసెర్ మహమ్మద్ వసీం తో కలిసి ఆఫ్రిది పాల్గొన్నారు  ఈ సందర్భంగా అఫ్రిది మాట్లాడుతూ   పాక్ జట్టులో ఐక్యత లోపించడానికి కారణం చాలా విషయాలు వసీం కు తెలుసు.. నాకు కూడా తెలుసు. కానీ మేము ఇప్పుడు మాట్లాడలేము. వరల్డ్ కప్ తర్వాత ఓపెన్ గా మాట్లాడతా. మా వాళ్లే జట్టులో ఐక్యతను నాశనం చేశారు. ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడితే మా అల్లుడు షాహిన్ కు  మద్దతుగా మాట్లాడుతున్నానని అంటారు. నేను అలా కాదు. నా కూతురు నా కొడుకు నా అల్లుడు తప్పు చేసిన వాళ్ళది తప్పు అని అంటాను అంటూ ఆఫ్రిది చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా  మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: