పాకిస్తాన్ తో మ్యాచ్ ఫై.. హార్దిక్ షాకింగ్ కామెంట్స్?

praveen
జూన్ రెండవ తేదీ నుంచి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమైంది. కానీ వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూసే మ్యాచ్ మాత్రం రేపు జరగబోతుంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న పాకిస్థాన్, ఇండియా మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా అది వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. సాదరణంగా అయితే ఏదైనా మ్యాచ్ జరిగితే.. ఆ రెండు దేశాలకు సంబంధించిన అభిమానులు మాత్రమే మ్యాచ్ చూడటం చేస్తూ ఉంటారు. కానీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే క్రికెట్ ప్రపంచం మొత్తం పనులన్నీ పక్కన పెట్టేసి మ్యాచ్ చూసేస్తూ ఉంటుంది.

 ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు టీమ్స్ చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయ్. అదే సమయంలో పాకిస్తాన్, ఇండియా మధ్య అటు క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అన్ని జట్ల లాగా ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. కాబట్టి ఎప్పుడో ఓసారి జరిగే ఈ దాయాదుల పోరును మిస్ చేసుకోవడానికి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అస్సలు ఇష్టపడరు. అయితే టి20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9వ తేదీన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ మ్యాచ్ ఉత్కంఠ ఎలా ఉండబోతుందో అనే విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇదే విషయం గురించి అటు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ తనకు మరింత స్పెషల్ గా ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇది పోరాటం కాదు చరిత్ర అవుతుంది అంటూ హార్దిక్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. పాకిస్తాన్తో పోరు ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటుంది. ఆనందం బాధ ఆందోళన కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు అభిమానులు కూడా అనుభవిస్తారు. పాకిస్తాన్తో మ్యాచ్లో తప్పకుండా గెలుస్తాము అనే నమ్మకం ఉంది అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: