దమ్ముంటే.. వరల్డ్ కప్ గెలిచి చూపించండి : పాక్ మాజీ

praveen
గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండా లీగ్ దశతోనే టోర్నీ నుంచి నిష్క్రమించి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు ఇక ఇప్పుడు t20 ప్రపంచ కప్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ విజేతగా నిలవాలని అనుకుంటుంది. కానీ టి20 ప్రపంచ కప్ 2024 కు ముందు పాకిస్తాన్కు అన్ని ఎదురు దెబ్బలే తగిలాయ్. బాబర్ స్థానంలో షాహిన్ ఆఫ్రిది టి20 కెప్టెన్గా రావడం.. ఇక న్యూజిలాండ్తో సిరీస్ లో 5-0 తేడాతో వైట్ వాష్ కావడం.. ఆ తర్వాత బాబర్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం.. లాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

 పాకిస్తాన్ క్రికెటర్ల ఫిట్నెస్ పై విమర్శలు రావడంతో చివరికి మిలిటరీ టైపు ట్రైనింగ్ రూపంలో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇక పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రానిస్తుంది అనే విషయంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ఆ దేశ అభిమానులు. కానీ ఇటీవల మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ జట్టు యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్లో చివరికి ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇక ఆ జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 దమ్ముంటే ఈసారి వరల్డ్ కప్ సాధించి చూపించాలి అంటూ పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షహజాద్ సవాల్ విసిరాడు. పాకిస్తాన్ క్రికెటర్ల క్రమశిక్షణ గురించి మాట్లాడాలంటే తెల్లారిపోతుంది. మనం ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. జటుల కీలకమైన ఆటగాడిగా ఉన్నప్పుడు నాకంటే ఎవరు ఎక్కువ కాదనే భావనలో మునిగిపోయినప్పుడు.. వరల్డ్ కప్ గెలిచి చూపించాలి అంటూ ఆ జట్టు కెప్టెన్ బాబర్ కు సవాల్ విసిరాడు పాకిస్తాన్ మాజీ ప్లేయర్. ఇప్పటికే ఐదు టోర్నమెంట్లు ఆడిన మీలో మార్పు రాకపోతే కష్టమే అంటూ పరోక్షంగా సెటైర్లు వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: