హెడ్ కోచ్గా గంభీర్.. గంగూలీ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో టీమిండియా నూతన హెడ్ కోచ్ గురించి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఎప్పుడో ముగిసింది. కానీ బిసిసిఐ పెద్దల స్పెషల్ రిక్వెస్ట్ తో అతను ఇంకొంత కాలం పాటు ఇక భారత జట్టుకు కోచ్గా ఉండేందుకు ఒప్పుకున్నాడు. కానీ మరోసారి పూర్తిస్థాయి హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం అంగీకరించలేదు. దీంతో బీసీసీఐకి కొత్త హెడ్ కోచ్ ని వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 కోచ్ కావాలి అంటూ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఇటీవలే కొత్త హెడ్ కోచ్ కు సంబంధించి పలువురు పేర్లు కూడా తేరమీదికి వచ్చాయి. వీళ్ళే టీమ్ ఇండియాకు కొత్త హెడ్ కోచ్ గా రాబోతున్నారు అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత జట్టుకు కొత్త కోచ్ గా రాబోతున్నాడని.. బీసీసీఐ పెద్దలు అతనితో ఇప్పటికే చర్చలు పూర్తి చేసుకున్నారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అంటూ ఒక వార్త గత కొన్ని రోజుల నుంచి తెగచక్కర్లు కొడుతుంది.

 అయితే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ను ఎంపిక చేయడం విషయంలో.. అటు బీసీసీఐకి పలు సూచనలు సలహాలు ఇచ్చాడు  బిసిసిఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ. ఒక ప్లేయర్ భవిష్యత్తు అతని కోచ్ ని బట్టి ఉంటుంది. అతని మార్గదర్శకం, నిరంతర శిక్షణ మైదానం తో పాటు జీవితంలోనూ అతన్ని మారుస్తాయి. కాబట్టి కోచ్ ని నిర్ణయించే ముందు కాస్త ఆలోచించండి అంటూ సూచించాడు సౌరబ్ గంగూలీ. అయితే గౌతమ్ గంభీర్ టీమిండియా కు కొత్త హెడ్ కోచ్ గా రాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న వేళ అటు సౌరబ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: