ఐపీఎల్ ఫైనల్ లో అదరగొట్టిన స్టార్క్.. రిటైర్ కాబోతున్నాడా?

praveen
మొన్నటి వరకు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరినీ అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఇటీవల ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి కోల్కతా జట్టు విజయం సాధించింది. అయితే 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఒక ఆటగాడు తరచూ వార్తలలో నిలుస్తూనే ఉన్నాడు. అతనే ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఎందుకంటే ఐపీఎల్ వేలంలో అతను టోర్నీ చరిత్రలోనే అత్యధికత ధర పలికాడు. 24.75 కోట్ల రూపాయలు పెట్టి కోల్కతా జట్టు అతన్ని జట్టులో చేర్చుకుంది.

 అయితే ఇలా భారీ ధర పెట్టిన ఆటగాడు ప్రదర్శన ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూశారు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన చేస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి ఆటగాడికా 24.75 కోట్ల రూపాయలు పెట్టింది అంటూ కోల్కతా యాజమాన్యంపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం అతను అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టును విజయ తీరాల వైపుకు నడిపించాడు అని చెప్పాలి. ఇలా తరచూ తన ఆట తీరుతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు.

 అయితే ఇక ఇప్పుడు మరోసారి రిటైర్మెంట్ వార్తలతో  హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్  స్టార్క్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నాడా అంటే ఇటీవల చేసిన కామెంట్స్ దీనికి ఊతమిచ్చేలాగే కనిపిస్తున్నాయి. కచ్చితంగా నా కెరియర్ ముగింపుకు చాలా దగ్గరగా ఉన్నాను. కాబట్టి ఓ ఫార్మాట్ నుంచి తప్పుకోక తప్పదు. వచ్చే వన్డే వరల్డ్ కప్ చాలా దూరంలో ఉంది. ఇక ఆ ఫార్మాట్ గురించి ఇక ఆలోచించాలి. అలా అయితేనే నేను ఫ్రాంచైజీ క్రికెట్ కి దగ్గరగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు స్టార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: