నేనైతే బాగా ఆడా.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వరల్డ్ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి విరాట్ కోహ్లీ ఎప్పుడు జట్టు విజయాల లో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ కెరీర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొడుతూ.. ఇక అరుదైన రికార్డులు సృష్టిస్తూ ఉంటాడు.

 అందుకే విరాట్ కోహ్లీని అందరూ రికార్డులు రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు. ఇంకొంద మంది రన్ మిషన్ అని అంటూ ఉంటారు.  అయితే ఇక ఇలా అభిమానులు తనకు ఇచ్చిన బిరుదులకు అనుగుణంగానే ఎప్పుడు విరాట్ కోహ్లీ ఆట తీరు కూడా కొనసాగుతూ ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో భారీగా పరుగులు చేసి జట్టును ఆదుకోవడంలో ఎప్పుడూ కోహ్లీ ముందు ఉంటాడు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

 అయితే ఈ రిటైర్మెంట్ వార్తల పై స్పందించిన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా నిలిచిన కోహ్లీ.. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ సీజన్లో నా ప్రదర్శన పై సంతృప్తి  గా ఉన్న. జట్టు మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండో హాఫ్ లో వరుసగా మ్యాచ్లు గెలిచిన ఫలితం లేకుండా పోయింది. ఈసారి బలం గా తిరిగి వస్తాం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 2025 లోను ఇదే ఫామ్ కొనసాగిస్తాను అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ ఎక్కువ పరుగులు చేసిన వీరుడుగా రికార్డు సృష్టించినప్పటికీ ఆర్సిబి ఓడిపోవడంతో కోహ్లీ వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచిస్తాడు అంటూ కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: