మరోసారి "RCB" పై కామెంట్స్ చేసిన అంబటి రాయుడు... ఈసారి ఎవరిని ఉద్దేశించి..?

Pulgam Srinivas
ఇండియా క్రికెట్ జట్టులో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న ఆటగాళ్లలో అంబటి రాయుడు ఒకరు. ఈయన చాలా లేట్ వయసులో ఇండియన్ క్రికెట్ టీం లోకి ఎంట్రీ ఇచ్చిన తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అనేక మ్యాచులు ఆడారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఇండియన్ క్రికెట్ జట్టుకు నుండి రిటైర్మెంట్ తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ కి రాయుడు దూరంగా ఉంటున్నాడు.

ఇక ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా ఈయన ఆడడం లేదు. ఇది ఇలా ఉంటే అంబటి రాయుడు గత కొన్ని రోజులుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై విమర్శలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కూడా ఈయన ఆ జట్టు పై కొన్ని విమర్శలు చేశారు. తాజాగా అంబటి రాయుడు మాట్లాడుతూ ... ఎన్నో సంవత్సరాలుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మద్దతు ఇస్తున్న అభిమానులను చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాల కోసం ఆడితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే బహుళ టైటిల్ లను సాధించేది. మంచి ఆటగాళ్లను ఆ జట్టు వదులుకుంటుంది.

జట్టు విజయమే తొలి ప్రాధాన్యంగా భావించే ప్లేయర్ లకి మేనేజ్మెంట్ సపోర్ట్ చేయాలి. మెగా వేలం నుంచి ఇది ప్రారంభం కావాలి అని అంబటి రాయుడు కామెంట్ చేశారు. ఇకపోతే తాజాగా అంబటి రాయుడు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ లో బెంగుళూరు మొదటి ఎనిమిది మ్యాచ్ లలో ఒకటే గెలిచి ఆల్మోస్ట్ ప్లే ఆప్స్ లోకి రావడం ఆసంభవం అన్న స్థానం నుండి ఆ తర్వాత ఆరు మ్యాచ్ లకి ఆరు గెలిచి ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ప్లే ఆప్స్ లో ఈ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడి ఓడిపోయి సీజన్ నుండి నిష్క్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ar

సంబంధిత వార్తలు: