IND vs PAK మ్యాచ్ టికెట్ ధర రూ.16.6 లక్షలా.. వామ్మో?

praveen
వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండియా, పాకిస్తాన్ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగిన ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రస్తుతం నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో అన్ని దేశాల లాగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు  జరగవు.. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడటం చూస్తూ ఉంటాము.

 అందుకే ఎప్పుడో ఓసారి జరిగే ఈ దాయాదుల పోరును  చూసేందుకు కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది  అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మరోసారి ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరు ప్రేక్షకులను అలరించబోతుంది. జూన్ 9వ తేదీన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఎప్పుడు విడుదలైన హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉంటాయి.

 అయితే కొన్ని కొన్ని సార్లు ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల ధరలు తెలిసి అందరూ అవాక్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో టికెట్లు ధరలపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐసీసీ తీరును ఆయన తప్పుపట్టారు. జూన్ 9వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ టికెట్ ధర చూసి షాక్ అయ్యా. ఒక్కో టికెట్ కి 20వేల డాలర్లు అంటే 16.6 లక్షలకు విక్రయించడం చూసి షాక్ అయ్యాను. అమెరికా ఈ ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇస్తుంది లాభాల కోసం కాదు. గేమ్ ని విస్తరించడానికి. మామూలు టికెట్ ధర కూడా 2750 డాలర్లు ఉండడం నిజంగా దారుణం అంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: