ఐపిఎల్ ఉండగా.. అంతర్జాతీయ మ్యాచ్ లు ఎందుకు : బట్లర్

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఏ రేంజ్ లో గుర్తింపు ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక ప్రతి ఏడాది కూడా ఐపిఎల్ లో ఆడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్లేయర్లు తరలివస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోనే పలు జట్లలో భాగం అవుతుంటారు. ఇక ఐపీఎల్ లో స్వదేశీ ఆటగాళ్ళ కంటే విదేశీ ఆటగాళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే విదేశీ ప్లేయర్లు ఏకంగా రికార్డులు స్థాయి ధర పలకడం కూడా చూస్తూ ఉంటాం.

 అయితే అటు ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించే ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతం ప్రదర్శన చేస్తూ ఆయా జట్ల విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎప్పటి లాగానే ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. కానీ ఇటీవలే అంతర్జాతీయ మ్యాచ్ లు ఉండడం కారణంగా సరిగ్గా ప్లే ఆఫ్ సమయానికి ఇక ఇంగ్లాండ్ ప్లేయర్ లందరూ కూడా స్వదేశానికి వెళ్ళిపోయారు. దీంతో కీలక ప్లేయర్స్ ని దూరం చేసుకుని కొన్ని టీమ్స్ అయోమయం లో పడి పోయాయి అని చెప్పాలి.

 అయితే ఇలా ఐపిఎల్ సమయం లో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించడం పై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ జరిగే సమయం లో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ చేయరాదు అంటూ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచ్లకు ఏడాదిలో ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. కానీ ఐపీఎల్ అలా కాదు  దాని కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ ఉంటుంది. అందుకే ఐపీఎల్ జరిగే సమయంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లోపెట్టకూడదు అంటూ బట్లర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: