ఆ రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయింది.. కోహ్లీ కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తన ఆట తీరుతో  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే రికార్డులు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు.

 ఇలా అంతర్జాతీయ క్రికెట్లో దశాబ్దన్నర కాలంగా విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ నైపుణ్యంతో కొల్లగొట్టిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. క్రికెట్ దేవుడిగా పేరు సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ కెరియర్ లో సాధించిన రికార్డులను సైతం తుడి చేయడంలో సక్సెస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే ఇలా ఇప్పటికే ఎన్నో వందల రికార్డులు సాధించిన ఇప్పటికీ.  జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగానే విరాట్ కోహ్లీలో ఏదో నిరూపించుకోవాలి అనే కసి కనిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని ఏళ్లపాటు టీం ఇండియాకు కెప్టెన్ గా కూడా మారిపోయి జట్టును విజయ తీరాల వైపుకు నడిపించాడు అని చెప్పాలి.

 ఇక సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీ ఫాలోవర్లను సంపాదించుకోవడంలో కూడా తోపు అనే నిరూపించుకున్నాడు. అయితే ఇటీవలే తనకు కెరియర్ లో రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. జట్టును గెలిపించడానికి తాను ఫీల్డ్ లో కృషి చేస్తానని.. దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదు అంటూ తెలిపాడు. అయితే ఆటపై తన ప్రేమ ఆకలి ఎప్పటికీ తగ్గబోదు అంటూ చెప్పుకొచ్చాడు  ఇక వచ్చే టి20 వరల్డ్ కప్ కు ఇదే తన ప్రేరణ అంటూ తెలిపాడు. ఇటీవల జియో సినిమా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశాడు. కెరియర్ లో 2016 సంవత్సరంలోనే రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయింది. ఆ ఏడాదిలో టి20 వరల్డ్ కప్స్ సెమీఫైనల్ లో ఓడిపోవడం.. ఐపీఎల్లో ఫైనల్లో ఓడిపోవడంతో తన హార్ట్ బ్రేక్ అయింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: