చెన్నై ఓటమి.. ఆ టీమ్స్ కి అదృష్టంగా మారిందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగింది. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ధోని కెప్టెన్సీ లోనే ప్రతి ఐపీఎల్ టోర్నీ ఆడిన ఈ జట్టు ఈసారి మాత్రం ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ కెప్టెన్సీలో బరిలోకి దిగి పరవాలేదు అనిపిస్తుంది. అయితే ధోని సూచనలతో అటు రుతురాజ్ కూడా తన కెప్టెన్సీ నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

 అయితే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది అన్న విషయం తెలిసిందే. గుజరాత్ జట్టు తమ ముందు ఉంచిన 231 పరుగుల టార్గెట్ ను చేదించడంలో విఫలమైంది. ఈ క్రమంలోనే 35 పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. అయితే ఈ ఓటమితో అటు చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఇలా చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి మిగతా జట్లకు కలిసి వచ్చేలాగా కనిపిస్తుంది అని చెప్పాలి. చెన్నై ఓటమితో ఢిల్లీ, బెంగళూరు, లక్నో, గుజరాత్ జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

 ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత స్థానంలో ఉన్న ఈ నాలుగు జట్లకు ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు 59 మ్యాచులు ముగిసిన ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ కు అధికారికంగా క్వాలిఫై అవ్వలేదు. అయితే ఇప్పటికే ముంబై, పంజాబ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్లే ఆఫ్ లో చోటు సంపాదించుకోవడం కోసం మిగతా జట్లు తీవ్రంగానే శ్రమిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అటు చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో.. పాయింట్ల పట్టికలో చెన్నై తర్వాత ఉన్న టీమ్స్ అన్నీ కూడా తమ రన్ రేట్ మెరుగుపరుచుకుని చెన్నైని వెనక్కి నెట్టి టాప్ ఫోర్ లో నిలవాలని అనుకుంటున్నాయ్. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: