పక్కింటి ఆంటీ వల్లే.. నేను క్రికెటర్ అయ్యా : నితీష్ కుమార్ రెడ్డి

praveen
ప్రస్తుతం హోరహోరీగా జరుగుతున్న ఐపిఎల్ టోర్నీలో ఎంతోమంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. అదే సమయంలో ఇక ఐపీఎల్లో ఛాన్స్ దక్కించుకున్న తెలుగు క్రికెటర్లు కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే  అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న యువ ఆటగాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి.. సైతం అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా వీరబాదుడు బాదేస్తున్నాడు అని చెప్పాలి. దీంతో అతి తక్కువ సమయంలోనే అతను టీమ్ ఇండియాలోకి రావడం ఖాయమని అటు అభిమానులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు.

 అయితే తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితీష్ కుమార్ రెడ్డి తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. క్రికెట్ వైపు ఎలా అడుగులు వేశావు అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అడిగాడు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి తాను క్రికెటర్ కావడం వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. మా నాన్న జింక్ ఉద్యోగి. జింక్ మైదానంలో నా కెరియర్ మొదలైంది. అయితే వేసవి సెలవుల్లో నేను నా ఫ్రెండ్స్ తో కలిసి బాగా క్రికెట్ ఆడేవాడని. మా పక్కింటి ఆంటీ కి మా అమ్మకు అస్సలు పడేది కాదు. నేను మాత్రం ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోకే తరచూ బంతిని కొడుతూ ఉండేవాడిని. దాంతో ఆ ఆంటీ మా అమ్మతో ఎప్పుడు గొడవ పెట్టుకునేది.

 దీంతో ఓ రోజు మా అమ్మ నాపై చాలా సీరియస్ అయింది. సమ్మర్ హాలిడేస్ లో వీడు ఏం చేయడం లేదు. గ్రౌండ్ కు తీసుకెళ్లి పడేయండి అని మా నాన్నకు సరదాగా చెప్పింది. మా నాన్న అది సీరియస్గా తీసుకున్నాడు. ఇక మా నాన్న కబడ్డీ ప్లేయర్ కావడంతో రోజు గ్రౌండ్ కి వెళ్తు.. నన్ను కూడా తీసుకెళ్లడం మొదలు పెట్టారు. ఇక అక్కడ నా ఆట చూసిన కోచ్ బాగా ఆడుతున్నాడు. కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్ అవుతాడని నాన్నకు చెప్పడంతో ఆయన నన్ను నమ్మి కోచింగ్ ఇప్పించాడు. ఇలా పక్కింటి ఆంటీ వల్ల నాకు కెరియర్ ప్రారంభమైంది అంటూ నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని.. ఆయనలో ఉన్న అగ్రేషన్ ఎంతగానో నచ్చుతుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: