కష్టాలు, త్యాగాలు అనే మాటే నాకు నచ్చదు : కోహ్లీ

praveen
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా క్రికెటర్ లాగానే భారత జట్టులోకి వచ్చినప్పటికీ అతి తక్కువ సమయం లో తానేంటో నిరూపించుకున్నాడు. తన ఆట తీరుతో తాను అందరిలా వచ్చి పోయే ఆటగాడిని కాదు క్రికెట్ చరిత్ర  లో ఎప్పటికి నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు  ఇక ఎంతో మంది లెజెండ్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి ఇక ఎన్నో రికార్డులను తన పేరిట లికించుకున్నాడు విరాట్ కోహ్లీ.

 ఒక రకంగా చెప్పాలి అంటే నేటి జనరేషన్లో ఎంత మంది స్టార్ ప్లేయర్లు ఉన్న తనను మించిన లిజెండరీ క్రికెటర్ మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇక ఇప్పటికీ కూడా కొత్తగా జట్టు  లోకి వచ్చిన ఆటగాడిలాగా ఏదో నిరూపించుకోవాలనే కసి కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు పరుగుల వరద పారిస్తూనే ఉంటాడు. ఇక మూడు ఫార్మాట్లలో కూడా ప్రస్తుతం టీమిండియా లో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ కెరీర్ లో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు.

 తన తండ్రి చనిపోయిన వెళ్లకుండా క్రికెట్ మ్యాచ్ పూర్తి చేసుకుని మరి అంత్యక్రియలకు హాజరవడం లాంటి ఎన్నో త్యాగాలు చేశాడు కోహ్లీ. అయితే తాను ఎన్నో కష్టాలు పడ్డానని త్యాగాలు చేశానని ఎప్పుడూ చెప్పుకోనని క్రికెటర్ విరాట్ ఒకటి చెప్పుకొచ్చాడు. నా జీవితం లో నేను ఎలాంటి కష్టాలు పడలేదు. ఎలాంటి త్యాగాలు చేయలేదు. అందరి లాగానే నేను కూడా కష్టపడి పని చేస్తున్న. ప్రజల కష్టాలతో పోల్చి చూస్తే నా కష్టాలు ఎంత.. అందుకే వాటి గురించి ఎప్పుడు మాట్లాడాలని అనుకోను అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: