అది ధోనికే సాధ్యం.. టామ్ మూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ ఐపిఎల్ సీజన్లో ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగానే ధోని అంటే పవర్ఫుల్ హిట్టింగ్ కి మారుపేరు అన్న విషయం తెలిసిందే. గతంలో టీమిండియా తరఫున ఆడుతున్న సమయంలో ఇక మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగుతూ తన బ్యాటింగ్ తో జట్టుకు ఎప్పుడు సూపర్ ఫినిషింగ్ ఇస్తూ ఉండేవాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ధోని క్రీజ్ లో ఉన్నాడు అంటే చాలు తప్పకుండా టీమిండియా గెలుస్తుంది అని అభిమానులు బలంగా నమ్ముతూ ఉండేవారు.

 అంతలా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించేవాడు మహేంద్ర సింగ్ ధోని. వరల్డ్ క్రికెట్లోనే బెస్ట్ ఫినిషర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే గతంలో టీం ఇండియా తరఫున ఆడినప్పుడు మాత్రమే కాదు ఇక ఇప్పుడూ 42 ఏళ్ళ వయసులో ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో కూడా ధోనిలో బ్యాటింగ్ గ్రేస్ ఎక్కడ తగ్గలేదు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో అయితే మరోసారి వింటేజ్ ధోనిని చూస్తున్నారు అభిమానులు. లుక్స్ పరంగా మాత్రమే కాదు బ్యాటింగ్ పరంగా కూడా వింటేజ్ ధోనీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో చివర్లో బ్యాటింగ్ చేయడానికి వస్తున్న ధోని ఇక మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉన్నాడు. సిక్సర్లు పోర్లతో విరుచుకుపడుతున్నారు.

 ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ధోని ఫామ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇదే విషయంపై సన్రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ధోనిలో పరుగుల ఆకలి తగ్గలేదు అంటూ వ్యాఖ్యానించాడు. 42 ఏళ్ల వయసులో అది ఏడాదంతా ప్రాక్టీస్ లేకుండా సరాసరి గ్రౌండ్లో దిగి అలా ఆడటం అసాధ్యమైన విషయం అంటూ టామ్ మూడి వ్యాఖ్యానించాడు. ధోనీకి ఇంకా పరుగుల ఆకలి తగ్గలేదు. చాలాఫిట్ గా క్రికెట్ పై మక్కువతో కనిపిస్తున్నాడు అంటూ టామ్ మూడి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: