టి20 వరల్డ్ కప్ లో.. ఈ పదిమంది ఫిక్స్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ దృష్టి కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ మీదే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరగబోయే ఈ టి20 ప్రపంచ కప్ లో అత్యుత్తమ టీం తో బరిలోకి దిగడమే లక్ష్యంగా అన్ని జట్లు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా టీమ్ లోకి సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.

 అయితే ఇటీవల కాలంలో వరల్డ్ కప్ లో పాల్గొనబోయే అన్ని టీమ్స్ కి కూడా ఇక జట్టులోకి ఆటగాళ్లను సెలెక్ట్ చేయడానికి ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ అనేది మొదటి ఆప్షన్ గా మారిపోయింది. ఎందుకంటే దాదాపు అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపిఎల్ ఆడుతున్నారు. దీంతో ఇక వారి వారి ఫామ్ ను బట్టి ఇక జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే బిసిసిఐ కూడా ఇలాంటి ప్రణాళికలతోనే ముందుకు సాగుతుంది. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు దాదాపుగా t20 వరల్డ్ కప్ లో చోటు తగ్గుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ జట్టు ప్రకటన విషయంలో ఐసీసీ డెడ్ లైన్ ప్రకటించింది.

 ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ జట్టులో ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై అటు బీసీసీఐ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే 10 మంది సభ్యులను బీసీసీఐ ఖరారు చేసిందట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, సూర్య, హార్దిక్, బుమ్రా, జడేజా, అర్షదీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లను ఇప్పటికే t20 వరల్డ్ కప్ జట్టు కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈనెల 27 లేదా 28వ తేదీన ఇక వరల్డ్ కప్ జట్టుపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుస్తుంది. అయితే టి20 వరల్డ్ కప్ లో చోటు తగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం అందరూ ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: