రోహిత్.. మళ్లీ ముంబై కెప్టెన్ అయ్యాడు : హర్భజన్

praveen
టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ మొన్నటి వరకు అటు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కూడా కొనసాగాడు అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సక్సెస్ కావడంతోనే అతనికి టీం ఇండియా కెప్టెన్సీ  ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఏకంగా ఐపీఎల్ హిస్టరీలోనే ముంబై ఇండియన్స్ కి ఐదు సార్లు టైటిల్ అందించి ఆ టీమ్ ని ఛాంపియన్ జట్టుగా నిలిపాడు. ఇక ప్రతి ఏడాది కూడా ముంబై ఇండియన్స్ టైటిల్  ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 అలాంటి రోహిత్ శర్మను జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇక సీనియర్  రోహిత్ శర్మను అవమానిస్తున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోవడంతో ఇక హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత రోహిత్ శర్మ ఎక్కడ మళ్లీ కెప్టెన్సీలో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం చివరి ఓవర్లలో మళ్ళీ కెప్టెన్ గా అవతారం ఎత్తిన రోహిత్ శర్మ ఇక తన వ్యూహాలతో ఫీల్డింగ్ ని సెట్ చేయడం బౌలర్లను మారుస్తూ ఉండడం చేశాడు.

 ఇది చూసి ఫ్యాన్స్ అందరూ కూడా మురిసిపోయారు అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఆ జట్టు మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ తో మ్యాచ్లో రోహిత్ ముంబైకి కెప్టెన్సీ చేశాడు అంటూ పేర్కొన్నాడు భజ్జి. జట్టును గెలిపించేందుకు రోహిత్ హార్దిక్ కలిసి సమాలోచన చేయడం ముచ్చటగా అనిపించింది. ముంబై ని చూస్తే ముచ్చటేసింది. పంజాబ్ బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్లలో రోహిత్ బౌలర్లను మార్చుతూ ఫీల్డింగ్ సెట్   చేసి కెప్టెన్సీ చేశాడు. ఇక బౌలర్లతో మాట్లాడాడు  అయితే ఆ మ్యాచ్ లో ముంబై జట్టు గెలిచినప్పటికీ ఈ ఆటతో ప్లే ఆఫ్ కు వెళ్లడం ఎంతో కష్టం అంటూ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: