మొన్నే వచ్చాడు.. అంతలోనే టీమిండియా కెప్టెన్సీ?

praveen
ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియా కు మూడు ఫార్మట్ లలో కెప్టెన్ గా  వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రోహిత్ శర్మ తర్వాత టీం ఇండియాకు ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అంటే అందరూ హార్థిక్ పాండ్యా పేరు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అటు రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న ప్రతిసారి కూడా హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా సక్సెస్ అవుతున్నాడు.

 దీంతో అటు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కు కెప్టెన్ కాబోయేది హార్దిక్ పాండ్యానే అన్న విషయం అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఒకానొక సమయంలో రోహిత్ శర్మను కాదని హార్దిక్ కే టి20 వరల్డ్ కప్ లో జట్టును నడిపించేందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు అని అటు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇక రోహిత్ శర్మే సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. అయితే ఇక రోహిత్ రిటైర్మెంట్ తర్వాత హార్దిక్ పాండ్యా చేతికి టీమిండియా కెప్టెన్సీ రావడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు బీసీసీఐ మరో కొత్త కెప్టెన్ ను తెరమీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందట.

 ఏకంగా జింబాబ్వేతో జరిగే టి20 సిరీస్ కోసం రిషబ్ పంత్ ని ఇక టీమిండియా కెప్టెన్ గా ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తుందట  టి20 వరల్డ్ కప్ తర్వాత జూలై ఆరవ తేదీ నుంచి 14 వరకు జింబాబ్వే తో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతుంది  అయితే ఈ పర్యటనకు భారత తృతీయ జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లు అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంతును పంపించాలని భావిస్తున్నారట. దీంతో మొన్నే కోలుకొని ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పంత్ అంతలోనే ఇంకా టీమిండియా కెప్టెన్సీ అందుకోబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: