ఐపీఎల్ : ఈసారి టైటిల్ గెలిచే టీం అదేనట?

praveen
ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్  పంచుతూ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ వస్తుంది ipl టోర్ని. ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా క్రికెట్ పండగ కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూసేందుకు ప్రేక్షకులందరూ కూడా సిద్ధం అయిపోతున్నారు. మరోవైపు అద్భుతంగా ఆడుతున్న టీమ్స్ ను ఇక ప్రశంసిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఇప్పటికే అన్ని టీమ్స్ దాదాపుగా ఏడు మ్యాచ్లు ఆడాయి. దీంతో సగం ఐపీఎల్ పూర్తయినట్లే.

 ప్రస్తుతం ఉన్న పరిణామాల దృశ్య ఏ టీం ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలుస్తుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ.. తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి రివ్యూలు కాస్త తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. అయితే ఇటీవల ఇదే విషయంపై క్రిక్ ట్రాకర్ వేసిన అంచనా ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రిక్ ట్రాకర్ తెలిపింది.

 ఆ జట్టు టైటిల్ సాధించేందుకు 19% అవకాశం ఉంది అంటూ పేర్కొంది. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధించేందుకు 14 శాతం ఛాన్స్ ఉందట. ఇక కోల్కతా నైట్రేటర్స్ కు 13 శాతం, చెన్నై సూపర్ కింగ్స్ కి 13, లక్నోకి 10,  ఢిల్లీకి 9, ముంబైకి 7, గుజరాత్ కి ఆరు, పంజాబ్ కి ఐదు,  బెంగుళూరుకి నాలుగు శాతం టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంది అంటూ  క్రిక్ ట్రాకర్ తెలిపింది. కాగా ఈ ఏడాది అటు రాజస్థాన్ రాయల్స్  ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: