ఇండియా కెప్టెన్ గా రిషబ్ పంత్... ఏ సిరీస్ కో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
(ఐ పీ ఎల్) మ్యాచ్ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న ప్లేయర్ లలో రిషబ్ పంత్ ఒకరు. రిషబ్ పంత్ టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక ఒక వైపు తన బ్యాట్ తో భారీ పరుగులను రాబడుతూ వచ్చిన రిషబ్ తన కీపింగ్ తో కూడా ఎన్నో పరుగులను ఆపి ఎన్నో విజయాలను తన జట్టుకు అందించి టీమిండియాలో కీలక పాత్రను పోషించాడు. ఇలా టీమ్ ఇండియా జట్టులో కీలక ఆటగాడిగా మారిన సమయం లోనే ఈయనకు రోడ్డు యాక్సిడెంట్ జరిగింది.

అందులో గాయాల పాలు అయినా రిషబ్ కొంత కాలం పాటు మ్యాచ్ లకి దూరం అయ్యాడు. ఇకపోతే తిరిగి మళ్ళీ ప్రస్తుతం ఈయన (ఐ పీ ఎల్) మ్యాచ్ లను ఆడుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈయన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన కెప్టెన్సీ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుత మంచి ప్రదర్శననే కనబరుస్తుంది. ఇకపోతే తాజాగా (బీ సీ సీ ఐ) ఈయనను ఇండియా టీం కెప్టెన్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది ఏ సిరీస్ కి అని అనుకుంటున్నారా..? ఆ విషయాలు తెలుసుకుందాం.

మరికొన్ని రోజుల్లోనే "టీ 20" వరల్డ్ కప్ జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అది ముగియగానే ఇండియా జట్టు జింబాబ్వే తో ఓ "టీ 20" సిరీస్ లో పాల్గొనబోతోంది. దీనికి కెప్టెన్ గా రిషబ్ పంత్ ను (బీ సీ సీ ఐ) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే (బీ సీ సీ ఐ) అనేక కసరత్తులను చేసి రిషబ్ ను ఈ జట్టుకు కెప్టెన్ గా నియమించినట్లు తెలుస్తోంది. ఇకపోతే జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును పంపియాలని (బీ సీ సీ ఐ) భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: