తలదించుకో.. తిలక్ వర్మకు సూర్య కుమార్ వార్నింగ్?

praveen
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం దూకుడు మీద ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ మొదట్లో హ్యాట్రిక్ ఓటములతో అభిమానులందరికీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది ముంబై ఇండియన్స్ జట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఇక హ్యాట్రిక్ గెలుపుతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే మళ్లీ పుంజుకుని ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టేలాగే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లు చూస్తూ ఉంటే ఆ జట్టు ఆటగాళ్లు అందరు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో స్వేచ్ఛగానే ఆడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే కేవలం మైదానంలో మాత్రమే కాదు డగ్ అవుట్ లో కూడా ఇలాగే సరదా సరదాగా గడిపేస్తున్నారు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఇటీవలే ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఏకంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను టీజ్ చేస్తూ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా సూర్య కుమార్ యాదవ్ టీం సభ్యులతో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం మంచి ఫామ్ తో ఆకట్టుకుంటున్న తిలక్ వర్మను దారుణంగా టీజ్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ముందుగా సూర్య వెనుక నుంచి వచ్చి తిలక్ వర్మ కళ్ళు మూస్తాడు. కళ్ళు మూసిన వ్యక్తి ఎవరో కనిపెట్టు అంటూ ఒక టాస్క్ ఇస్తాడు. అయితే ఆ టాస్క్ లో గెలిచేందుకు తిలక్ వర్మ ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ చివరికి రాంగ్ ఆన్సర్ ఇస్తాడు. దీంతో కళ్ళపై నుంచి చేతులు తీసిన సూర్య కుమార్ యాదవ్ ఇక తిలక్ పరువు తీస్తాడు. ఇలా అయితే నువ్వే గుండావి అవుతావా రా తిలక్ అంటూ సూర్య కుమార్ అంటాడు. సొంత ప్లేయర్ని మూడేళ్లుగా కలిసి ఆడుతున్న నన్ను గుర్తుపట్టలేకపోయావు కెమెరా ముందు తలదించుకొని అంటూ సరదాగా వార్నింగ్ ఇస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: