టి20లలో డబుల్ సెంచరీ.. కేవలం అతనికే సాధ్యం : కేన్

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే టార్గెట్ ప్రతి ఒక్క ఆటగాడికి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చే ప్రతి బ్యాటర్ కూడా విధ్వంసం సృష్టించాలి అనే మైండ్ సెట్ తోనే ఆడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రతి బంతిని బౌండరీకు తరలించేందుకు వీరబాదుడు బాదటం చూస్తూ ఉంటాం. అయితే ఇలా భారీ స్కోరు చేయాలి అనే ఆలోచనతో వచ్చిన ఆటగాళ్ళు కొంతమంది సక్సెస్ అయితే ఇంకొంతమంది ఆటగాళ్లు మాత్రం విఫలమౌతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక కొంతమంది ప్లేయర్లు అయితే విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించి.. ఏకంగా శతకాల మోత మోగిస్తూ ఉంటారు. అతి తక్కువ బంతుల్లోనే డబుల్ సెంచరీలు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంతో అలవోకగా శతకాలు చేయడంలో అటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో సమర్థుడు. ఇప్పటివరకు బ్యాటింగ్ లో తాను ఏం చేయగలను అనే విషయాన్ని చేసి చూపించాడు.  అయితే టి20 ఫార్మట్ లో ఇప్పటివరకు ఎన్నో సార్లు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఇక డబుల్ సెంచరీ మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. కానీ వన్డే ఫార్మాట్లో మూడుసార్లు డబుల్ సెంచరీలు చేయడం గమనార్హం.

 డబుల్ సెంచరీ చేయగల సత్తా ఎవరికైనా ఉందా అంటే అది కేవలం రోహిత్ శర్మకు మాత్రమే ఉంది అంటూ న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఓపెనర్ కాబట్టి ఎక్కువ సేపు ఆడేందుకు సమయం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా అతని బ్యాడ్ నుంచి ద్విశ్శతకం రావచ్చు. ఇక ఈ ఐపీఎల్లో ఆ ఫీట్ నమోదైన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రోహిత్ కు ఇప్పటికే వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన అనుభవం ఉంది. కాబట్టి టి20 ఫార్మాట్లో కూడా అతనికి డబుల్ సెంచరీలు కొట్టడం అంత కష్టమైన పని కాదు అంటూ కేన్ విలియమ్సన్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: