నాకు గతంలోకి వెళ్లే ఛాన్స్ ఉంటే.. నేను అదే చేస్తా : కేఎల్ రాహుల్

praveen
గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న టీమ్ ఇండియాకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కడం లేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నిలో కూడా ఇదే జరిగింది. టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి మ్యాచ్ నుంచి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వరుస విజయాలతో దూసుకుపోయింది. సెమీఫైనల్ వరకు వరుసగా పది మ్యాచ్ లలో విజయ డంక మోగించింది.

 ఇలా సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియాకు చివరికి తుది పోరులో మాత్రం చుక్కెదురైంది. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో తప్పకుండా వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది అనుకున్న అభిమానులందరికీ కూడా నిరాశ తప్పలేదు. ఈ క్రమంలోనే ఈ ఓటమితో అటు భారత క్రికెట్ మొత్తం నైరాస్యంలో మునిగిపోయింది అని చెప్పాలి. అభిమానులు కూడా ఈ ఓటమిన్ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇప్పటికీ కూడా ఈ ఫైనల్లో ఓటమి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.

 ఇక ఇటీవల ఇదే విషయం గురించి టీం ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో తాను ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ సమయం వెనక్కి వెళ్లగలిగితే మీరు ఏ నిర్ణయాన్ని సరి చేసుకుంటారు అంటూ అశ్విన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ ఇలా బదులిచ్చాడు. ఫైనల్ లో ఆస్ట్రేలియా పై నేను చివరి వరకు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది  దీనివల్ల 30 నుంచి 40 పరుగులు ఎక్కువగా వచ్చేవి. ప్రపంచకప్ మా చేతుల్లో ఉండేది. దీనికి నేను ఎప్పుడూ చింతిస్తూనే ఉంటాను అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: