ఇకపై ప్రతి మ్యాచ్.. మాకు సెమీఫైనలే : RCB కోచ్

praveen
ప్రతి సీజన్లో లాగానే ఈ ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ఆట తీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉంది. అయితే ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల ఆర్సిబి జట్టు కప్పు గెలిచినట్లుగానే ఐపీఎల్లో పురుషుల ఆర్సిబి జట్టు తప్పకుండా కప్పు గెలిచి తీరుతుందని అభిమానులు బలంగా నమ్మారు. కానీ ఇక ఆర్సిబి ఆట తీరు చూస్తుంటే కప్పు గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయిన అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నాయ్. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది.

 పాయింట్ల పట్టికలో చిట్టచివరన కొనసాగుతుంది అని చెప్పాలి. దీంతో ఆర్సిబి కప్పు గెలవకపోయినా పర్వాలేదు కానీ మరి ఇంత దారుణంగా ఆడి అభిమానులను నిరాశపరచకపోతే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈసారి కూడా కప్పు గెలవడం కలగానే మిగిలిపోయేలాగే ఉంది అని ఇంకొంతమంది ఫాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా వరుస ఓటములపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ అండి ఫ్లవర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ఇకపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా సెమి ఫైనల్ మ్యాచ్ అనుకునే ఆడతాం అంటూ ఆర్సిబి కోచ్ అండి ఫ్లవర్ అన్నారు. సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ మాకు ఎంతో కఠినమైనది. ఆ ఓటమి మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టింది. కానీ ఆ మ్యాచ్లో మా మిడిల్ ఆర్డర్ గొప్పగా పోరాడింది. మా జట్టు పోరాడినందుకు గర్వంగా ఉంది. ఇక తర్వాత మ్యాచ్ లలో బలంగా తిరిగి వస్తాం. వరుస విజయాలు సాధించి గాడిలో పడతాం అంటూ ఆర్సిబి కోచ్ అండి ఫ్లవర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: