ఒకే ఫ్రేమ్ లో సచిన్, ధోని, రోహిత్.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా క్రికెటర్లను దేవుళ్ల లాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు.. ఇక ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి మ్యాచ్ వీక్షించడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షిస్తే ఇంకొంతమంది.. స్టేడియం కు వెళ్లి ప్రత్యక్షంగా క్రికెట్ ను చూస్తూ అసలు సిసలైన మజాను పొందాలని అనుకుంటూ ఉంటారు.

 మరి కొంతమంది  ప్రేక్షకులు తమ అభిమాన క్రికెటర్లతో ఒక ఒక్కసారైనా ఫోటో దిగే అవకాశం వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఈ అవకాశం కోసం కాస్త రిస్క్ చేస్తారు. ఏకంగా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా సెక్యూరిటీని దాటుకొని మరి మైదానంలోకి పరుగులు పెడుతూ వెళ్లి అభిమాన క్రికెటర్ను కలిసి ఒకసారి ఆలింగణం చేసుకొని మళ్లీ సంతోషంతో మైదానం బయటికి పరుగులు పెట్టుకుంటూ రావడం ఎన్నోసార్లు చూశాం.  క్రికెట్కు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే ప్లేయర్లకు సంబంధించిన ఏవైనా అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తే.. అవి తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

 ఇక క్రికెట్ లెజెండ్స్ అందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇక అభిమానులకు పండగే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భారత క్రికెట్ లెజెండ్స్ అయినా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒకే చోట కనిపించారు. వీరు ముగ్గురు కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చొని ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాడ్ షూటింగ్ కోసం వీరు ఒకచోట చేరినట్లు తెలుస్తుంది. అయితే ఒకే ప్రమ్ లో ముగ్గురు లెజెండ్స్ ని చూడటం బాగుందని.. కోహ్లీ కూడా ఉంటే ఇంకా బాగుండేదని టీమిండియా ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: