కేఎల్ రాహుల్ స్పేర్ టైర్ లాంటివాడు.. టీమిండియా మాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ఇప్పటికే కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్నాడు కేఎల్ రాహుల్. అయితే అతను జట్టులో ఉన్న ప్రతిసారి కూడా అభిమానులందరికీ కూడా ఒక అనుమానం వస్తూ ఉంటుంది.  అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వస్తాడు అనే విషయంపై ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ నెలకొంటూ ఉంటుంది. ఎందుకంటే టీమిండియాలోని మిగతా ఆటగాళ్లలాగా అతనికంటూ ప్రత్యేకమైన స్థానం ఏదీ లేదు.

 కొన్నిసార్లు భారత జట్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చి అదరగొడుతూ ఉంటాడు. మరికొన్నిసార్లు ఏకంగా వన్ డౌన్ లో కూడా బ్యాటింగ్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఇలా జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఎప్పుడు తనను తాను మార్చుకుంటూ ఉంటాడు కేఎల్ రాహుల్. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసిన.. ఎంతో సొగసైన షాట్లు ఆడుతూ ప్రేక్షకులందరిని మైమరిపింప చేస్తూ ఉంటారు  ఇంకోవైపు వికెట్ కీపర్ గా కూడా అటు భారత జట్టుకు సేవలు అందిస్తూ ఉంటాడు. అయితే అలాంటి  రాహుల్ గురించి టీమ్ ఇండియా మాజీ ప్లేయర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్పేర్ టైర్ లాంటివాడు అంటూ భారత మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ను ఏ స్థానంలోనైనా ఆడించుకోవచ్చు. ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఉపయోగించుకోవచ్చు. అతనిలో తప్ప ఇంకెవరులో కూడా ఆ సత్తా లేదు. అతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి వారు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎవరూ లేరు అంటూ నవజ్యోతి సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే ప్రస్తుతం కేఎల్ రాహుల్ అటు ఐపిఎల్ లో బిజీగా ఉన్నాడు. లక్నో జట్టు కెప్టెన్ గాకొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: