పాకిస్తాన్ ప్లేయర్లకు స్నైపర్ ట్రైనింగ్.. ఇది ప్లాన్ బీ నా ఏంటి?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెటర్ల ఫిట్నెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి విమర్శలు నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీతో ఇక జట్టు ఆటగాళ్ళు అందరికీ కూడా శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఆర్మీ ట్రైనింగ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు అందరూ బిజీ బిజీగా ఉన్నారు.  ఈ క్రమంలోనే  ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్లో ఇలా పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్ల శిక్షణ కొనసాగుతుంది.

 అయితే ఈ ట్రైనింగ్ స్టేషన్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఏకంగా శిక్షణ శిబిరంలో పాకిస్తాన్ ఆటగాళ్లు అందరూ కూడా కొండలపై రాళ్లు మోస్తూ కనిపించారు. మొత్తం 29 మంది ప్లేయర్లు ఇలా కఠినమైన ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా క్రికెటర్లకు ఫిట్నెస్ పై ట్రైనింగ్ ఇవ్వడం మంచిదే. కానీ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్, అడ్వాన్స్ కాంబోట్ లో శిక్షణ  ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

 ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. వీడియోలో చూసుకుంటే ఆటగాళ్ళు తమ శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇతర వ్యాయామాలను ప్రదర్శించారు. కొండలు ఎక్కేటప్పుడు తలపై రాళ్లను మోస్తూ వెళ్తూ కనిపించారు. ఇంకోవైపు ఏకంగా కొంతమంది పాకిస్తాన్ ఆటగాళ్లు స్నైపర్ ట్రైనింగ్ లో కూడా పాల్గొన్నారు. ఏకంగా తుపాకీని ఎలా గురిపెట్టి కాల్చడం అనే విషయాన్ని నేర్చుకుంటున్నారు. అయితే క్రికెటర్లకు తుపాకులతో పని ఏంటి అని అందరూ విమర్శలు చేస్తున్నారు. ఇక ఇది ప్లాన్ బి అంటూ మరికొంతమంది ఇక ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: