ముంబై ఇండియన్స్ కు రోహిత్ గుడ్ బై.. మంచి నిర్ణయమంటున్న ఫ్యాన్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గత కొంతకాలం నుంచి ఒక విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అదే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను.. ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలను తప్పించింది. ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తమ జట్టులోకి తీసుకొని మరి అతని కి కెప్టెన్సీ అప్పగించింది.

 అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్లో ఎంత చెత్త ప్రదర్శన చేస్తూ పేలవ ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా అటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానిస్తున్నాడు అంటూ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నాటికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో కొనసాగుతాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఒక సంచలన న్యూస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 2024 ఐపిఎల్ సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకోవాలని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్వహించుకున్నాడట. హార్దిక్ కెప్టెన్సీ పై రోహిత్ శర్మ పూర్తిగా అసంతృప్తితో ఉన్నాడట. ఇక ఈ విషయాన్ని ఒక ముంబై ప్లేయర్ చెప్పినట్లు పలు మీడియా కథనాలు తెర మీదకి వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరగబోయే మెగా ఆక్షన్ లో హిట్ మ్యాన్ పాల్గొంటారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే రోహిత్ శర్మను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు  భారీ ధర పెట్టే అవకాశం లేకపోలేదు. ఇలా ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఏదో ఒక జట్టు రోహిత్ ని సొంతం చేసుకుని అతనికి కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: