"SRH" అభిమానులను టెన్షన్ పెట్టిన "RR"..!

Pulgam Srinivas
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లోకి పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ సన్రైజర్స్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. ఇక అందులో భాగంగా ఈ జట్టు ఇప్పటి వరకు మంచి స్థాయి పెర్ఫార్మన్స్ కనపరిచింది. కొన్ని రోజుల క్రితం సన్రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్ తో తెలపడింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన ఈ టీం 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగుల భారీ కోర్ ను నమోదు చేసింది. ఇప్పటి వరకు "ఐ పీ ఎల్" హిస్టరీ లోనే ఇదే భారీ స్కోర్.

ఇక 278 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ను కనబరిచి 5 వికెట్ల నష్టానికి 246 పరుగులను చేసింది. ఇకపోతే సన్రైజర్స్ జట్టు ఏకంగా 277 పరుగుల భారీ స్కోరును కొట్టడంతో ఈ మధ్య కాలంలో ఎవరూ కూడా ఈ స్కోర్ దరిదాపుల్లోకి కూడా రారు అని సన్రైజర్స్ జట్టు అభిమానులు ఆశించారు. కాకపోతే నిన్న కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా జట్టు 7 వికెట్లు నష్టానికి 20 ఓవర్లు ముగిసే సరికి 272 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఈ జట్టు సన్రైజర్స్ జట్టు సాధించిన 277 పరుగుల ఆల్ టైం హైయెస్ట్ స్కోర్ ని అవలీలగా దాటిస్తుంది అని చాలా మంది క్రికెట్ అభిమానులు అనుకున్నారు.

కానీ కోల్కత్తా జట్టు మొదట 12 ఓవర్ల వరకు అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ జట్టు స్కోర్ కొంత శాతం తగ్గింది. దానితో కోల్కతా జట్టు సన్రైజర్స్ సాధించిన 277 పరుగుల "ఐపీఎల్" ఆల్ టైం హైయెస్ట్ స్కోర్ ను బిట్ చేయలేకపోయింది. ఇది ఇలా ఉంటే కోల్కతా జట్టులో నరేన్ చాలా తక్కువ బంతుల్లో 89 పరుగులు చేసి కోల్కతా జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్రను పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srh

సంబంధిత వార్తలు: