బీసీసీఐ.. టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించేది.. అప్పుడేనట?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి. సాధారణంగా టి20 లీగ్ జరిగితేనే అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతూ ఉంటుంది. అలాంటిది ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది అంటే చాలు క్రికెట్ పండుగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ కి సంబంధించి అటు పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా ఈ పొట్టి ప్రపంచ కప్ జరగబోతుంది అని చెప్పాలి..

 కాగా ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే అటు టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టులో ఎవరు ఎంపిక అవుతారు అన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ జట్టు వివరాలను బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుంది అని భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఎంతోమంది ప్లేయర్లకు అటు టి20 వరల్డ్ కప్ లో ఛాన్స్ లో దక్కే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.

 ఇకపోతే  టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ చివరి వారంలో ఇలా జట్టు వివరాలను అధికారికంగా ప్రకటించబోతుందట బీసీసీఐ. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే ఒకటి వరకు ఐసిసి గడువుని ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ కప్ లో పాల్గొనబోయే అన్ని టీమ్స్ కూడా మే ఒకటి లోపు తమ టీమ్స్ వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో బీసీసీఐ కూడా ఆలోపే జట్టును ప్రకటించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందట. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబోతుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: