ప్చ్.. అరుదైన రికార్డు కోల్పోయిన భువి?
అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా కు దూరమైన భారత సీనియర్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఇక ఇప్పుడు ఐపీఎల్ లో అదరగొట్టేస్తూ ఉన్నాడు. తన బౌలింగ్ తో పరుగులను కట్టడం చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి అయితే ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఒక అరుదైన రికార్డు కోల్పోయాడు. మొన్నటి వరకు టి20 కెరియర్లో భువనేశ్వర్ కుమార్ ఒక్క నోబాల్ కూడా వేయని బౌలర్గా కొనసాగాడు. కెరియర్ మొత్తంలో ఇప్పటివరకు ఒక్క నో బాల్ కూడా వేయలేదు అని చెప్పాలి. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం ఈ రికార్డును కోల్పోయాడు.
ఇలా ఇప్పటివరకు టి20 క్రికెట్లో ఒక్క నోబాల్ కూడా వేయని ఫేస్ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ పై ఉన్న రికార్డు ఇటీవల చెరిగిపోయింది. ఎందుకంటే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక నోబాల్ వేశాడు భువనేశ్వర్ కుమార్. ఏకంగా లైన్ దాటి (ఓవర్ స్టెప్) బంతి వేశాడు. దీంతో అంపైర్ దీనిని నోబాల్ గా ప్రకటించాడు. ఇక ఇదే భువనేశ్వర్ కెరీర్ లో మొదటి నోబాల్ కావడం గమనార్హం. కాగా ఇక ఈమ్యాచ్లో 4 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కుమార్ 51 పరుగులు సమర్పించుకున్నాడు.