ఐపీఎల్ హిస్టరీలో.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లు వీళ్లే?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేటి నుంచి ప్రారంభం కాబోయే ఈ మెగా సమరం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశ్లేషకులు కూడా రివ్యూలు ఇవ్వడంలో బిజీ బిజీ అయిపోయారు అని చెప్పాలి. ఐపిఎల్ ప్రారంభం కాకముందే ఏ టీం ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై తమ అంచనాలను రివ్యూల రూపంలో చెప్పేస్తు ఉన్నారు  ఇక ఏ ఆటగాడు ఈసారి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడు అన్న విషయంపై కూడా రివ్యూ ఇస్తూ ఉన్నారు.

 ఇక ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే అదే సమయంలో ఇక పదహారేళ్ళ ఐపీఎల్ హిస్టరీలో జరిగిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనబరిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎవరు కొనసాగుతున్నారు అన్నది ఆసక్తికరంగా  మారింది. ఇలాంటి ప్రశ్న ఎవరినైనా అడిగితే మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ పేరు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ మ్యాచ్లలో కెప్టెన్ గా విజయాన్ని అందించారు అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకసారి ఆ విషయాలు చూసుకుంటే.. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి 133 విజయాలు అందించి ధోని కెప్టెన్గా అత్యధిక విజయాలు సాధించి టాప్ లో ఉన్నాడు. 226 మ్యాచ్లలో ఈ ఘనతను అందుకున్నాడు ధోని. ఇక రోహిత్ శర్మ 158 మ్యాచ్లలో 87 విజయాలతో తర్వాత స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్లలో 66 విజయాలు, గౌతమ్ గంభీర్ 129 మ్యాచ్లలో 71 విజయాలు, డేవిడ్ వార్నర్ 83 మ్యాచ్లలో 40 విజయాలు, గిల్ క్రిస్ట్ 74 మ్యాచ్లలో 35 విజయాలు, శ్రేయస్ అయ్యర్ 55 మ్యాచ్లు 27 విజయాలు, షేన్ వార్న్ 50 మ్యాచ్లలో 30 విజయాలు సాధించారు. వీళ్ళందరూ కూడా ఐపిఎల్ లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: