అనుకున్నదే జరిగింది.. RCB పేరు మార్చేసారుగా?

praveen
ఎప్పటిలాగానే ఈ ఐపిఎల్ సీజన్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ 17వ సీజన్లో అందరి దృష్టి కూడా బెంగళూరు టీం పైనే ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు గత 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీ లో ఒక్కసారి కూడా బెంగళూరు మెన్స్ టీం టైటిల్ గెలవలేకపోయింది. ఈ సాలా కప్ నమ్ దే అనే నినాదంతో ప్రతిసారి బరిలోకి దిగే బెంగళూరు జట్టుకు టైటిల్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. కానీ ఇటీవలే ఈ కలను నిజం చేసి చూపించింది బెంగళూరు ఉమెన్స్ టీం.

 ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్మృతి మందాన కెప్టెన్సీలో బరిలోకి దిగి టైటిల్ విజేత కనిపించింది. దీంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇలా మహిళల టీం టైటిల్ గెలిచిన నేపథ్యంలో ఇక ఈ ఏడాది పురుషుల టీం పై కూడా భారీగానే అంచనాలు ఉండే అవకాశం ఉంది. దీంతో అందరి కన్ను కూడా బెంగళూరు టీం పైన ఉంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి బెంగళూరు జట్టు పేరులో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి వార్తలు వస్తున్నాయి.

 అయితే దీనిపై ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆర్సిబి అన్ బాక్స్ ఈవెంట్ లో మాత్రం అందరూ అనుకున్నట్లుగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరులో స్వల్ప మార్పులు జరిగాయ్. ఈ అన్ బాక్స్ ఈవెంట్లో కెప్టెన్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా కొత్త జెర్సీలో కనిపించారు. అంతే కాదు కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు. అయితే మొన్నటి వరకు royal challengers Bengalur అని ఉన్న పేరులో స్వల్ప మార్పులు చేసి.. royal challengers Bengaluru గా మార్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: