హార్దిక్ వెళ్తానంటే.. అందుకే వద్దనలేదు : గుజరాత్ హెడ్ కోచ్

praveen
ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ప్రస్థానంపై సంచలన మార్పులు జరిగాయి. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదిలేసిన తర్వాత అతనికి అనుహ్యంగా కెప్టెన్సీ ని కట్టబెట్టింది. ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే అతనికి కెప్టెన్సీ ఇవ్వడమేంటి అని అందరూ అనుకున్నారు. కానీ ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత తన కెప్టెన్సీ తో అందరిని ఫిదా చేసేసాడు హార్థిక్ పాండ్యా. ఏకంగా జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ విజేతగా నిలపాడు. ఇక ఆ తర్వాత సీజన్లో ఏకంగా ముంబై జట్టు ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన చెన్నై చేతిలో చివరికి ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.

 దీంతో రోహిత్ సారధ్యంలో ముంబై ఎలా అయితే ఛాంపియన్ టీం గా ఎదిగిందో ఇక హార్దిక్ కెప్టెన్సీ లో గుజరాత్ అలాగే ఛాంపియన్ టీం గా ఎదుగుతుందని అందరూ బలంగా నమ్మారు. కానీ 2024 ఐపిఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అనూహ్యమైన  పరిణామాలు చేసుకున్నాయ్. ఏకంగా ఏకంగా గుజరాత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హార్థిక్  ఆ జట్టును వదిలి మళ్ళీ తన హోమ్ టీం అయినా ముంబైకి వచ్చేసాడు. ఇక్కడ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ ని పక్కన పెట్టి మరీ జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు  అప్పగించింది అని చెప్పాలి. అయితే ముంబై v విషయం పక్కన పెడితే హార్దిక్ లాంటి కెప్టెన్ ను గుజరాత్ ఎందుకు వదులుకుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రకు ఎదురవుగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. గుజరాత్  లోనే కొనసాగేలా హార్దిక్ పాండ్యాను నేను కన్విన్స్ చేయలేదు. ముంబై ఇండియన్స్ కాకుండా మరో జట్టుకు వెళ్తే మాత్రం అతని ఆపే ప్రయత్నం చేసేవాడిని. కానీ ఆరేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన తన పాత ఫ్రాంచైజీకే వెళ్తానని చెప్పడంతో కాదన లేకపోయాను. ఐపీఎల్లో కొనసాగుతున్న విధానం సాకర్, బాస్కెట్బాల్ ఫ్రాంచైజీ  లీగ్ ల సంస్కృతి. ఐపీఎల్ కు కూడా వచ్చిందని చాలామంది అంటుంటారు. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ మనం ఇంకా చాలా చూడబోతున్నాం అంటూ ఆశిష్ నెహ్ర చెప్పుకొచ్చాడు. హార్దిక్ ను గుజరాత్ తప్పకుండా మిస్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నూతన సారథి గిల్ జట్టును ఎలా నడిపిస్తాడో చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్ర తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: