హార్దిక్ ఏమైనా చంద్రుడు పైనుంచి దిగొచ్చాడా.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంతకాలం నుంచి బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా దేశవాళి క్రికెట్ ను నిర్లక్ష్యం చేస్తున్న ప్లేయర్లపై  కఠిన చర్యలు తీసుకుంది. జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లపై చర్యలు తీసుకుని ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇద్దరు ప్లేయర్లను తొలగిస్తు నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే కేవలం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మాత్రమే కాదు ఇక అందరూ ప్లేయర్లు కూడా తప్పనిసరిగా టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కనప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. డొమెస్టిక్ క్రికెట్ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తాము అంటూ స్పష్టం చేసింది. అయితే ఇలా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను దేశవాళి క్రికెట్ ఆడినందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన బీసీసీఐ హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హార్దిక్ పాండ్యా కూడా ఇలాంటి రూల్స్ వర్తింపచేయాలి అంటూ ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ఇప్పటివరకు స్పందించారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా ఆటగాళ్ల లాగానే హార్దిక్ పాండ్యా కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ప్రవీణ్ కుమార్. అతను ఏమైనా చంద్రుడు పైనుంచి దిగి వచ్చాడా.. అతను కూడా దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు ఆడాలి. అతని విషయంలో ప్రత్యేకంగా వేరే నిబంధనలు ఎందుకు. కేవలం వైట్ బాల్ క్రికెట్ లో మాత్రమే అతను ఎందుకు అందుబాటులో ఉంటున్నాడు అన్ని ఫార్మాట్లలో ఆడమని హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ వార్నింగ్ ఇవ్వాలి అంటూ ప్రవీణ్ కుమార్ సూచించాడు. అయితే ఇది నిజమే అంటూ కొంతమంది అతనికి మద్దతు పలుకుతూ ఉండగా..  మరి కొంతమంది మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: