RCB పేరులో మార్పు.. అదృష్టం ఏమైనా కలిసొస్తుందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీమ్స్ ఏవి అంటే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పేర్లు చెబుతూ ఉంటారు. అయితే ఇక చాంపియన్ టీమ్స్ అంటే అటు సోషల్ మీడియాలో ఉండే పాపులారిటీ కూడా మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రెండు ఛాంపియన్స్ టీం తో సమానంగానే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఒక జట్టు. ఆ టీం ఏదో కాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం. ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. కానీ ఒకసారి కూడా ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ ని ముద్దాడ లేకపోయింది బెంగుళూరు టీం. అయితే విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్  లాంటి ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్న ఈ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు.

 చివరికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ఫ్యాప్ డూప్లెసెస్ ప్రస్తుతం జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అయిన జట్టుకు టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు అన్న విషయం తెలిసిందే  అయితే ఏదో ఒక రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుంది అని అభిమానులు మాత్రం బలంగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో కూడా పక్క ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది బెంగళూరు జట్టు. ఇక మొదటి మ్యాచ్ లోనే అటు చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరులో స్వల్ప మార్పు జరిగింది అన్నది తెలుస్తుంది. ఎన్ని రోజుల వరకు  royal challengers Bangalore అని రాస్తుండగా.. ఈ పేరుని royal challengers Bangaloru అని మార్చినట్లు తెలుస్తోంది. అభిమానులు సూచన మేరకు ఇక జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందట. ఇందుకు సంబంధించి రిషబ్ శెట్టితో రూపొందించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతుందట బెంగళూరు ఫ్రాంచైజీ. ఇక ఈ స్వల్ప మార్పుతో జట్టుకు ఏదైనా అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: