కోహ్లీ మొదటి మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా.. అసలు విషయం ఏంటంటే?

praveen
టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అతను రెండోసారి తండ్రి కావడమే. ఏకంగా వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ మొత్తానికి కూడా దూరంగానే ఉన్నాడు. దాదాపు గత నెలన్నర నాటి నుంచి కూడా క్రికెట్ ఆడటం లేదు. అయితే తన భార్య అనుష్క శర్మ డెలివరీ ఉన్న నేపథ్యంలో.. ఈ సమయంలో తన భార్యకు తోడుగా ఉండాలి అని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం బీసీసీఐకి చెప్పగా.. వారు అతనికి సెలవులు మంజూరు చేశారు.

 అయితే ఈ విషయం బయటికి రాకపోవడంతో విరాట్ కోహ్లీ ఎందుకు ఇలా ఎక్కువ రోజులపాటు సెలవులు తీసుకున్నాడు అనే విషయంపై చర్చ జరిగింది. చివరికి ఓ రోజు కోహ్లీ తాను రెండో బిడ్డకు తండ్రి అయ్యాను అన్న శుభవార్తను చెప్పడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక విరాట్ కోహ్లీ మార్చి 22వ  తేదీ నుంచి ప్రారంభం కాబోయే.. ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. కొంతకాలం నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న ఐపీఎల్ తర్వాత కొన్ని మ్యాచ్లకు ఏమైనా దూరంగా ఉండే చాన్సులు కూడా ఉన్నాయని అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే ఈ విషయంపై విరాట్ కోహ్లీ అభిమానులు అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఏకంగా రెండో బిడ్డ పుట్టడంతో కొన్ని వారాలుగా క్రికెట్కు పూర్తిగా దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఈ వారం చివరికల్లా కోహ్లీ ఆర్ సి బి తో చేరబోతున్నాడు అని ఆ జట్టు వర్గాలు చెప్పాయి. కాగా ఈనెల 22వ తేదీన తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందుగానే ఫ్రీ సీజన్ క్యాంపులో విరాట్ కోహ్లీ జట్టుతో చేరి ప్రాక్టీస్ కూడా చేస్తాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: