ఓరి నాయనో.. ఒక్కడే 795 పరుగులు ఇచ్చాడు?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో కొనసాగుతున్న రెండు జట్ల మధ్య సాంప్రదాయమైన టెస్ట్ ఫార్మాట్లో సిరిస్ జరిగితే ఇక బంతికి బ్యాట్ కి మధ్య ఎంత హోరాహోరీ సమరం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగే పోరు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నే పొందారు ప్రేక్షకులు. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు అటు టీమిండియాతో సొంత గడ్డపైనే మ్యాచ్ ఆడింది. సాధారణంగా సొంతగడ్డపై టీమ్ ఇండియా అని ఓడించడం చాలా కష్టం.

 అదే సమయంలో ఇక టెస్ట్ ఫార్మాట్లో బజ్ బాల్ ఆట తీరుతో ఓటమి ఎరుగని జట్టుగా ఇంగ్లాండ్ కొనసాగుతూ ఉంది. దీంతో సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు అటు టీమ్ ఇండియాకు ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో అని అందరూ అంచనాలు పెట్టుకున్నారు అందరూ. అంచనాలు పెట్టుకున్నట్లుగానే అటు ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు జరిగింది. అయితే ఇక ఈ సిరీస్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది అని చెప్పాలి. భారత బ్యాట్ మెన్స్ దూకుడు ముందు ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా ఆ తర్వాత మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది అని చెప్పాలి.

 అయితే ఇక ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారింది. అదే సమయంలో కొంతమంది బౌలర్ల ఖాతాలో చెత్త రికార్డులు కూడా చేరిపోయాయి అని చెప్పాలి  ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లీ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్లలో కలిపి 795 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఫై అత్యధిక పరుగులు ఇచ్చిన రెండవ ఇంగ్లాండు బౌలర్గా టామ్ హర్ట్ లీ ఒక చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే తొలి స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ ఉన్నాడు. ఏకంగా 2016లో జరిగిన టెస్టు సిరీస్ లో 861 పరుగులు సమర్పించుకున్నాడు అదిల్ రషీద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: