తిరుగులేని ముంబై.. రెండోసారి టైటిల్ గెలిచేలాగే ఉందే?

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది. 2008లో ప్రారంభమైన ఈ టి20 టోర్ని ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా వరల్డ్ క్రికెట్లోనే పొట్టి ఫార్మాట్ కు ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఇక ఐపీఎల్ ఒక కారణంగా మారిపోయింది. అంతేకాదు జాతీయ జట్టులోకి రావాలనుకునే ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఒక సువర్ణ అవకాశంగా కూడా ఐపీఎల్ కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ ద్వారా పురుష క్రికెటర్లను ఎలా అయితే ప్రోత్సాహం ఇస్తున్నారో.. అలాగే మహిళా క్రికెటర్లను సైతం ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే.

 ఈ లీగ్ కి కూడా ఐపీఎల్ తరహాలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఎంతోమంది యువ ప్లేయర్లకు కూడా ఛాన్సులు దక్కాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత ఏడాది ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అయితే ఐపీఎల్ ఐదు సార్లు ట్రోఫీ విజేతగా నిలిచి  ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఛాంపియన్ అని నిరూపించుకుంది. మొదటి సీజన్లోనే ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇక మరోసారి ముంబై టైటిల్ ఎగరేసుకు పోతుందేమో అని అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.

 ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో భాగంగా ఇటీవలే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఈ పోరులో ఇక గుజరాత్ ను ఓడించిన ముంబై ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ బాటర్లలో హేమలత 74, కెప్టెన్ మూని 66 విధ్వంసం సృష్టించడంతో 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేదనలో హార్మన్ ప్రీత్ సింగ్ 95 వీర విహారం చేయడంతో ముంబై ఒక్క బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. ఇక ముంబై దూకుడు చూస్తుంటే వరుసగా రెండోసారి టైటిల్ గెలిచేలాగే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: