వామ్మో.. కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

praveen
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిగా.. భారత జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. తన ఆట తీరుతో వరల్డ్ క్రికెట్లో తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అని చెప్పాలి. నేటి జనరేషన్ క్రికెట్లో తనను మించిన లెజెండ్ మరొకరు లేరు అన్న విషయాన్ని కూడా ఇప్పటికే నిరూపించుకున్నాడు.

 ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరి చేత రికార్డుల రారాజు, కింగ్ కోహ్లీ అని పిలిపించుకుంటున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది లెజెండ్స్ సాధించిన రికార్డులను  అలవోకగా బద్దలు కొట్టేసాడు. అయితే నేటి జనరేషన్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ఇక అన్ని విషయాల్లో కూడా కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. కేవలం క్రికెట్లో రికార్డులు సాధించడం విషయంలోనే కాదు సోషల్ మీడియాలో ఫాలోవర్లను  సంపాదించుకోవడం విషయంలోనూ కోహ్లీనీ మించిన తోపు మరొకరు లేరు అనే లాగానే ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. అయితే ఆదాయం విషయంలోనూ ఇక అందరికంటే ముందున్నాడు కోహ్లీ. ఇప్పటికే ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక బీసీసీఐ ప్రతి ఏడాది అతనికి కోట్ల రూపాయల వేతనం చెల్లిస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోహ్లీకి ఆదాయం వస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇలా రెండు చేతుల సంపాదిస్తున్న విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడు ఆసక్తిని కనబరూస్తూ ఉంటారు. అయితే క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఒక వెయ్యి 90 కోట్ల వరకు ఉంటుందని FIN HQ పేర్కొంది. బీసీసీఐ ఏ ప్లస్ గ్రేడ్ హోదాను కలిగి ఉన్న కోహ్లీకి ప్రతి ఏటా 7 కోట్లు అందుకుంటాడు. దీనికి తోడు టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డే కి ఆరు లక్షలు, టి20 లకు మూడు లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అదనంగా అతని ఖాతాలో చేరుతుంది. ఇక ఐపీఎల్లో ఆడటం ద్వారా 15 కోట్లు ప్రతి ఏటా  సంపాదిస్తాడు. ఇక యాడ్స్ లో నటించడం ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోట్ల రూపాయలు అతని ఖాతాలో వచ్చి చేరుతాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: