జైష్వాల్ మామూలోడు కాదు.. అరంగేట్రం చేసి ఏడాది కూడా కాలేదు.. అంతలోనే?

praveen
యశస్వి జైస్వాల్.. గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు. అతను చూడ్డానికి ఒక కుర్రాడు. ఇంకా పాతీకెళ్ళు కూడా నిండలేదు. కానీ ఇక అతని ఆట తీరు మాత్రం ఏకంగా క్రికెట్ లెజెండ్స్ ను సైతం ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి. అందరిలాగానే అతను కూడా టీం ఇండియాలో అవకాశాలు దక్కించుకున్నాడు. కానీ తాను అందరి లాంటి ప్లేయర్ను కాదు అన్న విషయాన్ని మాత్రం అతి తక్కువ సమయంలోనే నిరూపించాడు యశస్వి జైపాల్.

 మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తున్న ఈ కుర్రాడు.. ఏకంగా డబుల్ సెంచరీలను కూడా అలవోకగా బాదేస్తూ ఉన్నాడు. దీంతో యశస్వి జైష్వాల్ బాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే అతని బ్యాటింగ్ విధ్వంసంతో ఎక్కడ తమ ఖాతాలో చెత్త రికార్డులు చేరిపోతాయో అని భయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలోనే తన ప్రదర్శనకు ఐసిసి ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి.

ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ ఇటీవలే మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో 12వ స్థానం నుంచి ఏకంగా పదవ స్థానానికి ఎగబాకాడు ఈ సెన్సేషనల్ కుర్రాడు  దీంతో అరుదైన రికార్డు సృష్టించాడు. అరంగేట్రం చేసిన ఏడాదికే జైష్వాల్ ఈ ఘనత సాధించడం విశేషం. అయితే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 11వ స్థానానికి విరాట్ కోహ్లీ ఎనిమిదవ స్థానానికి చేరారు. బౌలర్లలో బుమ్రా, అశ్విన్ తొలి రెండు స్థానాలలో ఉండగా జడేజా ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: