
తలకు తాకిన రాకసి బౌన్సర్.. కొద్దిలో ప్రాణాలు పోయేవి?
ప్రత్యర్థి ఫేసర్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఫిలిప్స్ హ్యూస్ కి బలంగా తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యులు అతని ఆసుపత్రికి తరలించినప్పటికీ. ప్రాణాలను మాత్రం కాపాడు లేకపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో ఆస్ట్రేలియా క్రికెటర్ విషయంలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. మరో రాకసి బౌన్సర్ ఆస్ట్రేలియా ఆటగాడిని కుప్పకూలిపోయేలా చేసింది. విల్ పుకోవ్స్కి అనే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు బౌలర్ వేసిన రాకాసి బాన్సర్ అతని తలకు బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అయితే ఈ ఊహించని ఘటనతో అటు మిగతా ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు అని చెప్పాలి. కాగా ఫిజియోలు హుటాహుటిన మైదానంలోకి పరుగులు పెట్టుకుంటూ వచ్చి సదరు ఆటగాడికి చికిత్స చేశారు. కొద్దిసేపటి వరకు సదరు బ్యాట్స్మెన్ కళ్ళు తెరవలేకపోయాడు. ఫిజియోల ప్రాథమిక చికిత్స అనంతరం మామూలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో 2014లో జరిగిన ఫిలిప్స్ హ్యూస్ మరణ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు అందరూ. అయితే ఇండియాలో రంజీ ట్రోఫీ లాగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్లో షఫీల్డ్ షీల్డ్ టోర్నీ జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.