రోబోలు కూడా ఇలా ఫీల్డింగ్ చేయవేమో.. ఇతను నిజంగా సూపర్ హీరోనే?

praveen
జెంటిల్మెన్ గేమ్ గా పిలుచుకునే క్రికెట్లో ఎప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  సాధారణంగా క్రికెట్లో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్  అనే మూడు విభాగాలు ఉంటాయి. మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించినప్పుడు మాత్రమే మ్యాచ్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫీల్డింగ్ అనేది ఎంతో కీలకంగా మారిపోతూ ఉంటుంది. ఒక జట్టు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఇక పరుగులను కట్టడం చేయడమే కాదు ఒక్క క్యాచ్ కూడా వదలకుండా పట్టుకుంది అంటే ఇక ఆ టీం తప్పకుండా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అందుకే తమ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది ఆటగాళ్లు ఏకంగా జట్టుకు విజయాన్ని అందించడం కోసం ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి విన్యాసాలు ఇక మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరిని అబ్బుర పరుస్తూ ఉంటాయి చెప్పాలి. ఇలాంటి విన్యాసం ఎవరైనా ఆటగాడు చేశాడు అంటే చాలు అందుకు సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ మెరుపు ఫీల్డింగ్ l తో అదరగొట్టేసాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఏకంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు సిక్స్ వెళ్లే బంతిని అడ్డుకోవడం పాటు బ్యాట్ మెన్ ను రనౌట్ చేశాడు. నేపాల్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి.

 ట్రై సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్, నేపాల్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. 120 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బలిలోకి దిగిన నేపాల్ 15.2 ఓవర్లను నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కాగా నేదార్ ల్యాండ్స్ ఇన్నింగ్స్ సమయంలో 19 ఓవర్లో చోటు చేసుకున్న ఘటన క్రికెట్ ఫ్యాన్స్ అందరిని కూడా కట్టిపడేస్తోంది. జితేందర్ సింగ్ 19 ఓవర్ వెయ్యగా.  ఓవర్ లోని ఓ బంతిని ఫుల్ టాస్ వేసాడు. నెదర్లాండ్స్ బ్యాటర్ రోల్ అఫ్ వాన్ డేర్ మెర్వే లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడాడు. బంతి సిక్స్ వెళ్లేలా కనిపించింది. అయితే అక్కడే ఫీల్డింగ్  చేస్తున్న కుశాల్ బుర్టెల్ అమాంతం గాల్లో కి ఎగిరి బంతిని అడ్డుకున్నాడు. అంతేకాదు బంతిని మైదానంలోకి పడేలా చేశాడు. ఇక ఈ విన్యాసం చేస్తున్న సమయంలో అతను కింద పడినప్పటికీ మళ్లీ లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు విసిరాడు. దీంతో రన్ అవుట్ కూడా చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: