ఇతను మామూలోడు కాదు.. టీమిండియాపై అరుదైన రికార్డు కొట్టాడుగా?

praveen
వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతూ ఉంది టీమిండియా. అన్ని ఫార్మాట్లలో కూడా బలమైన ప్రత్యర్థిగా ఇక అన్ని టీమ్స్ ని కూడా భయపెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియాతో మ్యాచ్ అంటే చాలు ఇక ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి అన్ని జట్లు. ఇక టెస్ట్ ఫార్మాట్లో అయితే టీమిండియాకు తిరుగు ఉండదు అని చెప్పాలి. అలాంటి పటిష్టమైన టీమిండియా పై కూడా కొంతమంది ఆటగాళ్లు అరుదైన రికార్డులు సాధించారు. అలాంటి వారిలో ఇప్పుడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ కూడా చేరిపోయాడు అని చెప్పాలి.

 ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిసాయ్. ఈ మూడు మ్యాచ్లలో కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.  అయితే ఇక ఇప్పుడు రాంచి వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్లో అటు వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్ మరోసారి తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. క్లాసిక్ సెంచరీ చేసి అదరగొట్టేసాడు.

 అయితే ఈ సెంచరీ ద్వారా ఏకంగా టీమిండియా పై ఒక అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు జో రూట్. భారత జట్టు పై టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలిచాడు. భారత జట్టుపై ఈ ఇంగ్లాండు ప్లేయర్ 52 ఇన్నింగ్స్ లలో ఏకంగా 10 సెంచరీలు చేశాడు అని చెప్పాలి. అయితే ఇటీవల చేసిన టెస్ట్ సెంచరీ తో ఈ రికార్డును అందుకున్నాడు. ఇక అతని తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ తొమ్మిది సెంచరీలు గ్యారీ సోబర్స్ ఎనిమిది, వివ్ రిచర్డ్ 8,  పాంటింగ్ 8 సెంచరీలతో టీమిండియా పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: