ఇప్పుడు రోహిత్ ఇష్టం లేకపోయినా.. హార్దిక్ కెప్టెన్సీలోనే ఆడాల్సిందే.. ఎందుకో తెలుసా?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకుని మరో జట్టు తరఫున ఆడతాడు అని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం. ఏకంగా ఆ జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ కు కనీస గౌరవం ఇవ్వలేదు అంటూ రోహిత్ శర్మ అభిమానులు అందరూ కూడా కెప్టెన్సీ మార్పు తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అయితే ఇలా తనను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్ జట్టు నుంచి అటు రోహిత్ శర్మ తప్పుకుంటాడని.. మరో టీంలోకి వెళ్లి కెప్టెన్సి చేపడతాడని అందరూ అనుకున్నారు. ఇలాంటి వార్తల నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కూడా ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ బయటికి వస్తే తమ టీం లోకి ఎక్కువ ధర పెట్టి తీసుకోవడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నాయి. అయితే ఇక ఇప్పటికీ కూడా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వదిలి వేరే టీం లోకి వెళ్లేందుకు అవకాశం ఉందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వదిలి వేరే టీంలోకి వెళ్లడం అసాధ్యం అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ ముగిసిన తర్వాత ట్రేడ్ విండో కూడా ముగుస్తుంది. దీంతో ఏ ఫ్రాంచైజీ కూడా ఇతర ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకునేందుకు అవకాశం ఉండదు. దీంతో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ నుంచి తప్పుకోవాలి అనుకున్న రోహిత్ శర్మకు ఇతర జట్టులోకి వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోయాయి అని చెప్పాలి. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోనే రోహిత్ ఐపీఎల్ సీజన్ ఆడాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుంది. కాబట్టి రోహిత్ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నో జట్లు అతని కోసం భారీ ధర పెట్టి కొనుగోలు చేసే అవకాశం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: